![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -692 లో..... కార్తీక్ కాఫీకి వెళ్ళగానే దీప కూడా వెళ్తుంది. ఈవిడ గారు కాఫీలు అంటూ తిరిగితే ఇక్కడ హార్డ్ వర్క్ ఎవరు చేస్తారని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ చెయ్యాల్సింది హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ అని సూరజ్ అంటాడు. స్మార్ట్ వర్క్ కాఫీ తాగుతూ కూడా చెయ్యొచ్చని సూరజ్ అంటాడు. జ్యోత్స్న వైపే సూరజ్ చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నిన్ను ఎవరు చూడడం లేదు.. నేను ఆ వాచ్ వైపు చూస్తున్నాను.. ఇప్పుడు మా టైమ్ నడుస్తుందని సూరజ్ అంటాడు.
మరొకవైపు కార్తీక్, దీప కాఫీ తాగుతూ దక్షిణామూర్తి గురించి మాట్లాడుకుంటారు. అతను ఎలాంటి వాడో తెలిసింది కదా.. ఇక అతని గురించి వదిలేసి వర్క్ పై ఫోకస్ చెయ్యమని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు క్యాబిన్ కి వెళ్తారు. అప్పుడే దీపకి తన రెస్టారెంట్ లో ఏదో గొడవ జరుగుతుందని ఫోన్ వస్తుంది. దాంతో అందరు అక్కడికి వెళ్తారు. మాణిక్యరావు అనే అతను బిర్యానీలో బొద్దింక వచ్చిందని గొడవ చేస్తాడు. అప్పుడే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి రప్పిస్తాడు. మా రెస్టారెంట్ లో ఎంత నీట్ గా మెయిన్ టేన్ చేస్తామో అందరికి తెలుసని శివన్నారాయణ అంటాడు. మాకు తెలుసు కానీ ఇప్పుడు సిచువేషన్ చూస్తే మా కంట్రోల్ లో లేదని ఫుడ్ ఆఫీసర్స్ అంటారు. ఒకసారి మా కిచెన్ ని చూడండి సర్ అని దీప వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంది. చేతకాని వాళ్ళకి ఇస్తే ఇలాగే ఉంటుందని శివన్నారాయణతో జ్యోత్స్న అంటుంది. బొద్ధింక వస్తుందని దీప కలగనలేదు కదా అని కార్తీక్ అంటాడు. ఎవరు ఏం చేస్తారో తెలియదు.. రెస్టారెంట్ సీజ్ చేస్తే నీ తాత తల తీసినట్లే అని శివన్నారాయణ అంటాడు. ఆ మాణిక్యరావు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే సూరజ్ కి డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్తాడు. రెస్టారెంట్ గురించి వీడియో తీస్తుంటే.. బ్రో చాలా బాగా యాక్టింగ్ చేసున్నావ్.. మొన్న నేను ఇలా చేసినందుకు నాకు లక్ష రూపాయలు ఇచ్చారని సూరజ్ అంటాడు.
అవునా మేడమ్ ఏంటి నాకు పది వేయిలు ఇచ్చిందని మాణిక్యరావు అంటాడు. ఎవరు ఆ మేడమ్ చెప్పు.. మనం మనం ఒకటి అని సూరజ్ అనగానే అతను జ్యోత్స్నని చూపిస్తాడు. నీకు ఇంకో పదివేలు ఇస్తాను.. గొడవ పెద్దది చెయ్ అని సూరజ్ అనగానే అతను సరే అంటాడు. ఇప్పుడు బిర్యానీలో నేనే బొద్దింక వేసాను.. అవసరం అయితే బల్లి కూడా వేస్తానని అతను అనడం సూరజ్ వీడియో తీస్తాడు. ఆ వీడియోని అందరికి చూపిస్తాడు. దాంతో శివన్నారాయణ అతన్ని కొడతాడు. నీతో ఇలా ఎవరు చేయించారని అడుగుతాడు. దీప కార్తీక్ లకి సూరజ్ సైగ చేసి అంతా జ్యోత్స్న పని అని చెప్తాడు. మాణిక్యరావు ఎక్కడ తన పేరు చెప్తాడోనని జ్యోత్స్న భయపడుతుంది. ఇప్పుడు ఎవరు చేయిస్తే ఏంటి.. ఇప్పుడు అయితే ఇదంతా కావాలని చేసిందని అర్థమైంది కదా అని మాణిక్యరావుని పంపిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |